శుక్రవారం మదనపల్లి–చెంబకూరు మార్గంలో పెంచుపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.
ఈ ఘటనపై సీపీఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి–రామసముద్రం ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు, టమోటా రవాణా జరుగుతుందని, వేలాది మంది ప్రయాణిస్తారని తెలిపారు. రోడ్డు అభివృద్ధిపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించిన ఆయన, వెంటనే డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.










