మదనపల్లెలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జలధార – జలహారతి పనులను పక్కా ప్రణాళికతో, నాణ్యతగా పూర్తి చేయాలని,
చెరువులు, వాగులు, కాలువల నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించి ఒక చెరువు నిండితే మరొక చెరువుకు నీరు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. పూడికతీత, కాలువల శుభ్రత, ఆక్రమణల తొలగింపును వేగవంతం చేయాలని, నరేగా కార్మికులను వినియోగించాలని, రైతులకు సూక్ష్మ సేద్యం, ఉద్యాన సాగుపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.










