అంబటి రాంబాబు ధర్మ పోరాటానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు మద్దతు

0
1

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేపట్టిన దీక్షకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, ప్రతిపక్ష నేతలను హింసించడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

అంబటిపై జరిగిన దాడి వెనుక లోకేష్, పెమ్మసాని హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఇలాంటి అణచివేత ధోరణులను ఎదుర్కొంటామని, అంబటి రాంబాబుకు వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ అండగా ఉంటాయని వెల్లంపల్లి స్పష్టం చేశారు.