పుంగనూరు: రాగి తీగల చోరీపై పోలీసులకు ఫిర్యాదు

0
4

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ తన వ్యవసాయ పొలంలో శుక్రవారం రాత్రి దుండగులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి, అందులోని దాదాపు 15 కేజీల రాగి తీగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై రైతు విజయ్ కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్సై కేవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.