శుక్రవారం మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు.
బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు









