ఏపీ సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అరుదైన జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.
రాష్ట్రంలో పాలనా సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ మరియు వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంలో ఆయన చూపుతున్న చొరవకు గాను ఈ అవార్డు వరించింది. శనివారం ముంబైలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు. కేవలం ఏడాది కాలంలోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడాన్ని జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది.









