రైతుపై తేనెటీగల దాడి పరిస్థితి విషమం.

0
6

మదనపల్లె మండలంలో వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) అనే రైతుపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి చేశాయి. పొలంలో కూరగాయ పంటలకు నీరు మళ్లిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

తీవ్ర గాయాలపాలైన రెడ్డప్పను కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.