గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఒక ట్రాన్స్జెండర్ మహిళను తన వ్యక్తిగత సహాయకురాలిగా నియమించడం ద్వారా సమానత్వానికి మార్గం చూపించారు. మంత్రి నారా లోకేశ్ ఈ చర్యను నిజమైన నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు.
అణగారిన వర్గాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం లక్ష్యమని మాధవి తెలిపారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.










