మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కొన్ని చోట్ల తీగలు ఫోలును చుట్టేసి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఏడాదిగా కొనసాగుతోందని గ్రామస్తులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.










