క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.ఎమ్మెల్యే పద్మావతి సహకారం తో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.క్రీడాకారులు క్రీడల్లో రాణించి కోదాడకు రాష్ట్రంలో గుర్తింపు తేవాలన్నారు.
క్రీడాకారులకు పేరుగాంచింది కోదాడ అన్నారు. క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు సహా కారం అన్ని వేళల్లో ఉంటుందన్నారు.ఉచిత వాలీబాల్ క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వాలీ బాల్ క్రీడ ల్లో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, స్థానిక కౌన్సిలర్ గురవమ్మ సైది బాబు,,ఎంఈఓ సలీం షరీఫ్,నాయకులు భద్రా రెడ్డి జూలూరి వీరభద్రం, చిలుముల వెంకటేష్ , పంది కళ్యాణ్ బాబు , చిన్న మారుతి శ్రీను , నాగుల మీరా ,బడుగుల సైదులు, శ్యామ్ ,పాముల భాస్కర్ ,మంద శ్రీనివాస్, జాన్అలెక్స్ ,శ్రావణ్ ,నజీర్ తదితరులు పాల్గొన్నారు.









