ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. వాసవి మాత శాంతి, సద్గుణాలు, సేవా భావానికి ప్రతీకగా నిలిచిన మహానుభావురాలని పేర్కొంటూ.
ఈ పవిత్ర జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ & డైరెక్టర్లు, మార్కెట్ యార్డు చైర్మన్, రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.










