అన్నమయ్య జిల్లా మదనపల్లె శాస్త్రి వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.
అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బింగి పాండు, ట్రెజరర్ నాగరాజు, ఉపాధ్యక్షులు యల్లంపల్లి ప్రశాంత్, లక్కీ టైల్స్ మాల్ నగేష్, తో పాటు ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, మహిళా సంఘం, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.










