ఇంధన సరఫరాలో కొరత లేదు.. ఆందోళన అవసరం లేదు: జేసీ.

0
3

మదనపల్లిలో డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఆదివారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడినా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు.

ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, సమస్యలుంటే 1967 లేదా మదనపల్లి కంట్రోల్ రూమ్ 08571-293001కు సమాచారం ఇవ్వాలని సూచించారు