అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇంటి స్థలాలు, పింఛను, వైద్య సౌకర్యాలు, రైల్వే పాస్లు, పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టాలు, అక్రిడిటేషన్లో పారదర్శకత అవసరమని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా రమేష్ రాయల్, ప్రధాన కార్యదర్శిగా హిదాయతుల్లా, ఏపీ బీజేఏ అధ్యక్షుడిగా రెడ్డి ప్రసాద్ ఎన్నికయ్యారు.










