“పీడీఎఫ్” లబ్ధిదారులకు చింతూరు ఐటీడీఏ పీఓ అలర్ట్.

0
3

చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గారు ముంపు నిర్వాసితులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు.వీఆర్ పురం మండలానికి చెందిన నాన్-ఎస్టీ (Non-ST) నిర్వాసిత కుటుంబాలు (PDFs).

తమ పునరావాస ఆప్షన్ ఫారమ్‌లను ఈ నెల 28వ తేదీ లోపు సమర్పించాలి.స్థానిక ఎంఆర్వో (MRO) కార్యాలయంలో ఫారమ్‌లు అందజేయాలని  ఐటీడీఏ పీఓ గారు మాట్లాడుతూ, ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్ ఫారమ్‌లను సమర్పించాల్సి ఉందని గుర్తు చేశారు. పునరావాస ప్రక్రియ ఎటువంటి అడ్డంకులు లేకుండా, వేగంగా సాగాలంటే నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారులు తమ ఫారమ్‌లను ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.

 

# Yadagiri