ఘనంగా రాజా వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు.

0
2

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వెంకటాద్రి నాయుడు ధర్మరక్షణ, దానగుణానికి నిలువుటద్దమని, అమరావతిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. దేవాలయాల నిర్మాణం, అన్నదానాలు, కరువు కాలంలో ప్రజలకు సహాయం వంటి ఆయన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.