చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని సోమవారం పట్టపగలే అరాచక శక్తులు దారుణంగా హత్య చేయడాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండించింది.
ఈ హత్యకు నిరసనగా పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిజం రాసినందుకు నిలువున నరికేసారంటూ రాయలసీమ జిల్లాల ఇన్చార్జ్ కవరకుంట్ల జయరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శులు షేక్ సలీం భాష, పిఏ హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .








