చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్ మరమ్మతులు చేస్తున్న సుధాకర్ (30) విద్యుత్ షాక్ తో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.








