అధికారం వచ్చిందనే అహంకారంతో అతిగా ప్రవర్తిస్తే ఊరుకోబోనని టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. జనసేనాని పవన్ కల్యాణ్‌తో తాను ఎంతో సన్నిహితంగా ఉంటున్నానని.
అదే సమన్వయం క్షేత్రస్థాయిలోనూ కనిపించాలని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు, కుర్చీల కోసం గొడవలు పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. గత పాలకుల గర్వాన్ని చూసే ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేస్తూ, నేరస్థులతో పోరాటం చేస్తున్నామని వైకాపాపై విమర్శలు గుప్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని దిశానిర్దేశం చేశారు.










