ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలిడీఆర్‌డీఓ నాగ పద్మజ…
లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత పనుల పరిశీలన…
కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ…
భారత్ అవాజ్ న్యూస్ :దుగ్గొండి: ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ నాగ పద్మజ అధికారులను ఆదేశించారు. మంగళవారం దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో చేపడుతున్న ఊర చెరువు పూడికతీత పనులను ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించారు. పనుల తీరును పరిశీలించిన అనంతరం కూలీలతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో తగినంత నీడ సౌకర్యం కల్పించాలని.
కూలీలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కూలీలకు ఓఆర్‌ఎస్ (ORS) ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధి పనుల్లో మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహించాలని, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను తప్పనిసరిగా నియమించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లెక్కల అరుంధతి, సర్పంచ్ కన్నం అలిమా చిరంజీవి, ఏపీవో శ్రీనివాస్, ఈసీ రాజు, టీఏ మౌనిక, పంచాయతీ కార్యదర్శి కొండల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ మరియు ఐకేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. దుగ్గొండి రిపోర్టర్ జి రాము…










