పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్….

0
4

భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మండల వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన మొత్తం 280 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులై, నూరు శాతం ఫలితాలతో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.

ఈ ఫలితాల్లో జె. కావ్యశ్రీ 566 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. మల్లంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎంజేపీ విద్యార్థి ఎన్. లోకేష్ 560 మార్కులతో ద్వితీయ స్థానం, దుగ్గొండి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లోకేష్ 554 మార్కులతో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. మండలం సాధించిన ఈ ఘనతపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొంటూ విజేతలందరినీ అభినందించారు.. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు….

భారత్ అవాజ్ న్యూస్: రిపోర్టర్ జి రాము దుగ్గొండి….