ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం…. ప్రతి ఒక్కరికీ 47 వైద్య పరీక్షలు.

0
2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వ్యాధుల నివారణే లక్ష్యంగా ప్రతి పౌరుడికి 47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 మొబైల్ మెడికల్ యూనిట్ల (104 వాహనాలు) ద్వారా గ్రామస్థాయిలో సేవలు అందిస్తారు.

ఏటా సుమారు 57 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ ప్రాజెక్టు కోసం రూ. 163 కోట్లు వెచ్చించనున్నారు. అత్యాధునిక పరికరాలతో లివర్, కిడ్నీ వంటి 11 విభాగాల్లో పరీక్షలు జరిపి, ప్రతి వ్యక్తికి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు (EHR) సిద్ధం చేస్తారు. రానున్న రెండు నెలల్లో ఈ పథకం అందుబాటులోకి రానుంది.