నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ.

0
3

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా అమరావతి క్వాంటం వ్యాలీలో రూ. 1,208.41 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ట్విన్ టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు. అలాగే సచివాలయం, అసెంబ్లీ భవన పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేయనున్నారు.

భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు పెంచే ప్రతిపాదనతో పాటు, పలు విద్యా సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించనుంది. రాజధాని పనులను వేగవంతం చేసి, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది.