ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు
అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం, పాడిపంటలాభివృద్ధి కోరిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యచందర్లపాడు మండలంలో శుక్రవారం నిర్వహించిన అలివేలమ్మ తల్లి తిరునాళ్ల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య భక్తులు, మహిళలు, గ్రామస్తులు మరియు కూటమి నేతలతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజల్లో పాల్గొన్న తంగిరాల సౌమ్య గారికి దేవాలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం మాట్లాడిన తంగిరాల సౌమ్య ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.









