మదనపల్లిలో ఘనంగా మే డే వేడుకలు.

0
2

మదనపల్లెలో అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కార్మికులు లేనిదే ప్రపంచం లేదని.

వారి కష్టంతోనే ప్రజలు సుఖంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల రక్షణ, శ్రేయస్సు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్మికుల సేవలను స్మరించుకున్నారు.