జలధార పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్.

0
4

అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 4,938 పనులు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు.

నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జల వనరులు, డ్వామా, భూగర్భ జలాలు, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పురోగతిని సమీక్షించారు. జలధార యాప్‌లో పనుల వివరాలు తక్షణమే నమోదు చేయాలని సూచించారు.