బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డ్.

0
3

మదనపల్లె మండలం కొండామరిపల్లి గ్రామ పరిధిలోని బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డును త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు.

శుక్రవారం మార్కెట్, రెవిన్యూ శాఖల అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ముంబై–చెన్నై జాతీయ రహదారికి సమీపంలో ఉండటం వల్ల బెస్తపల్లి ప్రాంతం మార్కెట్ యార్డుకు అనుకూలమని ఆయన పేర్కొన్నారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యార్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో భూమి పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.