ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నావి…

0
5

భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా….!

భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వేళ రోడ్లపై జనసంచారం తగ్గిపోయి, బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల కారణంగా చల్లని పానీయాలు, తాటి ముంజలు, నీటి పదార్థాల వినియోగం పెరిగింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము