ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మార్చి 3, 2026న హైకోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు అటవీ దలాల అధిపతి డాక్టర్ పి. వి. చలపతిరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ), అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిన సమాచారం తెలియజేస్తోంది# కొత్తూరు మురళి.










