ఏపీ టెన్త్ రిజల్ట్స్… నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.

0
5

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదు కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేసిన సంస్కరణలు, ముఖ్యంగా ‘100 రోజుల ప్రణాళిక’ మరియు ‘మెగా పేరెంట్-టీచర్స్ మీట్’ వంటి కార్యక్రమాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయని ఆయన కొనియాడారు.

గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 4% పెరగడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 72.8% నుండి 78.39%కి ప్రగతి సాధించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. ఈ విజయం వెనుక కృషి చేసిన ఉపాధ్యాయులకు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.