ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. DSF, PDSO విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రెస్ మీట్ ను ఉద్దేశించి PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ భాష్యం, చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు సెలవు దినాల్లో అడ్మిషన్లు చేపించాలంటూ
ఒత్తిడి తీసుకోవడం చాలా సిగ్గుచేటు ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం సమ్మర్ హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా భాష్యం, చైతన్య ,నారాయణ ఈ విద్యాసంస్థల్లో వచ్చే అకాడమీ కేర్ అడ్మిషన్లు ముందస్తుగానే నిర్వహించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు అకస్మాత్తుగా ఈ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి .లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిడిఎస్ఓ, డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు జైకృష్ణ మహేష్ కిరణ్ పిడిఎస్ఓ నాయకులు హరి మోహన్ విక్రమ్ తదితరులు పాల్గొనడం జరిగింది.









