ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదు కావడంపై కూటమి ప్రభుత్వ నేతల మధ్య ఆత్మీయ సంవాదం చోటుచేసుకుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేసిన సంస్కరణలను పవన్ కల్యాణ్ ప్రశంసించగా.
“పవనన్నా.. ఇది మనందరి విజయం” అని లోకేష్ బదులిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 72.8% నుండి 78.39%కి పెరగడం విశేషమని, ఇది ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమష్టి కృషి అని పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళిక, మెగా పేరెంట్ టీచర్స్ మీట్ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని పవన్ కొనియాడారు. భవిష్యత్తులో ఏపీ విద్యాశాఖను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.









