తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.

0
2

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు పశ్చిమ బెంగాల్ వాసులు దుర్మరణం పాలయ్యారు.

కోల్‌కతా నుండి రోగిని చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్ పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో రోగితో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.