ఏపీలో మళ్లీ ‘నక్ష’ సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు.

0
2

ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాల్లోని ఆస్తులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ‘నక్ష’ ప్రాజెక్టును పునఃప్రారంభించింది. కేంద్ర సహకారంతో డ్రోన్లు, జీఐఎస్ టెక్నాలజీ ద్వారా సర్వే నిర్వహించి, ప్రతి ఆస్తికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రాపర్టీ కార్డు జారీ చేయనుంది.

దీనివల్ల రిజిస్ట్రేషన్లు, బ్యాంక్ రుణాలు పొందడం సులభతరమవ్వడమే కాకుండా మున్సిపల్ ప్రణాళికల రూపకల్పన వేగవంతమవుతుంది. కాకినాడ, గుంటూరు, తిరుపతి సహా 9 నగరాల్లో ఈ సర్వే జరగనుంది. 2027 మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ కార్డులతో ఆస్తి హక్కులకు పూర్తి భరోసా లభిస్తుంది.