\మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్మికులకు తీపి కబురు అందించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తున్నామని ప్రకటించారు. 15 నగరాల్లో అత్యాధునిక ‘లేబర్ అమినిటీస్ సెంటర్లు’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ ద్వారా రూ.20 లక్షల బీమా సాయం అందుతుందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక కొరతతో కార్మికుల పొట్ట కొట్టిందని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా ఉంటుందని భరోసా ఇచ్చారు.










