సమాజం నుండి మనం ఎంతో పొందుతామని, తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు వచ్చిన జాస్తి వెంకట్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు.
రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు భాగస్వాములు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. జాస్తి వెంకట్ చేపట్టిన సేవా కార్యక్రమాలు మరెంతో మందికి స్ఫూర్తినిస్తాయని సీఎం ఆకాంక్షించారు. సంపాదించిన ధనాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలని, అప్పుడే ఆదర్శవంతమైన సమాజం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు.









