నది కైరవాడిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూమి రెవెన్యూ కన్ను

0
3

నదికైరవాడి శ్రీ ఆంజనేయ స్వామి భూముల సర్వేకు బ్రేక్.రెవెన్యూ మరియు ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, ముడుపులు ముట్టిన ఆరోపణలతో పాటు రాజకీయ నాయకుడి ఒత్తిడికి లోనై నదికైరవాడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన భూముల సర్వే నిలిచిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

దేవస్థాన ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు తమ విధులను విస్మరించి, అక్రమాలకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సర్వే ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వెనుక పెద్ద స్థాయి కుట్ర ఉందనే అభిప్రాయాలు గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్వేను పునఃప్రారంభించి, దేవస్థాన భూములను రక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.