అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా రాయచోటికి విచ్చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని ఆదివారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన అనంతరం, జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పలు అంశాలను చర్చించారు.









