అన్నమయ్య జిల్లాలో 156 మందికి ఉచిత సీట్లు జాబితా విడుదల.

0
2

2026-27 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ జాబితాను బుధవారం అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ డా. అనూరాధ విడుదల చేశారు. ఈ విడతలో 156 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రుల మొబైల్‌లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు.

అధికారిక వెబ్‌సైట్, మండల విద్యాశాఖ కార్యాలయాల్లోనూ జాబితాను ప్రదర్శించారు. ఎంపికైన విద్యార్థులు అవసరమైన పత్రాలతో ఈ నెల 17లోగా సంబంధిత పాఠశాలల్లో హాజరై ప్రవేశాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.