చిలుకూరు 06.05.26 (భారత్ ఆవాజ్ న్యూస్)
అక్రమ కార్యక్రమాలపై 100కు సమాచారం ఇవ్వండి, నేరాల నివారణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలి అని చిలుకూరు ఎస్సై హనుమ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చిలుకూరు పోలీస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సామాజిక అంశాల పట్ల నేరాల నిర్మూలన పట్ల ప్రజల భాగస్వామ్య అవసరం పట్ల అవగాహన కల్పించారు.
నేరాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని అసాంఘిక కార్యకలాపాలు అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని 100కు తెలియజేయాలని ఎస్సై సూచించారు. ప్రజల రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు మహిళా వేధింపులు బాలల వేధింపుల పట్ల 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు. పండుగల నేపథ్యంలో ప్రజలంతా సోదరా భావంతో కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. అక్రమ రవాణాకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.










