మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. లక్సెట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షం . కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం పై కవర్లు కప్పడానికి వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మరణించారు.
వారి మృతదేహాలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన రఘనాథ్ రావు మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుంటుబాలకు ప్రభుత్వం ఒక్కక్కరికి తక్షణమే ₹ 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మిల్లర్లతో కుమ్మక్కయ్యారని అన్నారు. అందుకే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందన్నారు. వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు










