పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం

0
2

పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ నేపథ్యంలో, బుధవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో షహవార్ (592), జీవన్ రెడ్డి (584), నాగసాయిరెడ్డి (584), వై. సారిక (580) వంటి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర సెక్రెటరీ మోహన్, మండల అధ్యక్షుడు బుడ్డన్న, జనరల్ సెక్రెటరీ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.