జాతీయ సాంకేతిక దినోత్సవం (మే 11) సందర్భంగా విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)లో స్టార్టప్ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. యువ ఆవిష్కర్తలు తమ మేధస్సును ప్రదర్శించడానికి ఇది గొప్ప వేదికని పేర్కొన్నారు.
ఈ ఎక్స్‌పోలో పాల్గొనే స్టార్టప్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రూ. 30,000 వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు. విజయవాడ జోన్ పరిధిలోని స్టార్టప్‌లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు 9154970454 నంబరును సంప్రదించవచ్చు.









