విజయవాడ కొండ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఎంపీ కేశినేని చిన్ని శుభవార్త వినిపించారు. జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల వరకు ఉన్న కొండ పోరంబోకు స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనిపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
ముఖ్యంగా విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని సుమారు 30 వేల మందికి ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని, వారి సొంత ఇంటి కలను నెరవేరుస్తామని ఎంపీ స్పష్టం చేశారు. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.









