పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబు పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం దర్గా వద్దకు చేరుకున్న ఆయనకు నిర్వాహకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, చాదర్ సమర్పించి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దువా చేశారు# కొత్తూరు మురళి.









