“ఉజ్వల 2.0 కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య”

0
6

తంగిరాల సౌమ్య నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్, సబ్‌స్టేషన్ నిర్మాణాలకు కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.