బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం: ఎస్పీ ధీరజ్.

0
4

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు.

సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.