సీఎం పర్యటనకు మార్కాపురంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు|

0
0

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. హెలిప్యాడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సభా వేదిక, వీఐపీ రూట్, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌ను కూడా పర్యవేక్షించి అవసరమైన సూచనలు చేశారు. ఈ బందోబస్తు కోసం ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఏపీఎస్పీ సిబ్బంది సహా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రజలు ట్రాఫిక్, భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.