రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం

0
6

చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి చెప్పే ఆదివాసి రేలా ఉత్సవాలలో వేలాది గిరిజనులు తరలివచ్చి జయప్రదం చేయాలని గిరిజన సంఘం మండల ఆధ్వర్యంలో వాల్ పోస్టులు ఆవిష్కరణ చేశారు గిరిజన సంఘం నాయకులు పొడియం లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం గ్రామస్తులతో మాట్లాడుతూ ఈనెల 24 25 26 తేదీలలో రంపచోడవరం కేంద్రంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి రేలా ఉత్సవాలను జయప్రదం చేయాలని అన్నారు. మన పూర్వీకుల వారసత్వం మన అడవి తల్లితో మనకున్న అనుబంధాన్ని ప్రతికలన్నారు. ఈ ఉత్సవాలను గిరిజన సత్తా చాటేలా నిరూపించుకుందామని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుండి ఆదివాసి బిడ్డలు మే 24న రంపచోడవరం వేలాది మందితో కదిలి వెళ్లి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన రేలా నృత్యం కొమ్ము డోల వంటి కళలను భావితరాలను అందించవలసిన బాధ్యత మన పైన ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు మడివి లక్ష్మణ్. కూర భీమయ్య. సోడి సింగయ్య. చందు. కిషోర్. లక్ష్మణ్. మనోజ్. తదితరులు పాల్గొన్నారు.

# Yadagiri