నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశం

0
1

భారత్ ఆవాజ్ న్యూస్ కదిరి : నల్లచెరువు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నల్లచెరువులో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. గీతా మందిరం సమీపంలో జరిగిన సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జాబితాల సేకరణపై చర్చించారు.కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశానికి మండల టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జీలు, బూత్‌ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.మండల కన్వీనర్ పి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.